Saturday, 16 June 2018

సముద్ర ప్రాణుల వర్షం....న్యూస్, ఫోటోలు మరియూ వీడియో


13/06/2018 బుధవారం, చైనాలోని సముద్రతీర నగరమైన Qingdao లో సముద్ర ప్రాణుల వర్షం కురిసింది.


వర్షం పడే ప్రతి రోజూ ఆక్టోపస్ లు, నక్షత్ర చేపలు, రొయ్యలు, మామూలు చేపలు వర్షంతో పాటూ ఆకాశం నుండి పడతాయా? అలా పడటం కూడా మనం చూసుండం...కొంతమంది వినే ఉండరు. కాని నిజానికి అదే జరిగింది. చైనా సముద్ర తీర నగరమైన Qingdao లో పోయిన బుధవారం నాడు తీవ్రమైన గాలివానతో వర్షం పడింది. గాలి తీవ్రత ఎంత అంటే ?...సముద్రంలోని ప్రాణూలను తన శక్తితో పీల్చుకుని నగరంలో పడేసింది.


రోడ్లు వరద నీటితో నిండిపోగా, వాహనాలు ట్రాఫిక్ జాం తో ఆగిపోయినై. ఇది మామూలే అయినా ఆ రోజు ఆ నగర ప్రజలు వర్షంతో పాటు సముద్ర ప్రాణులు పడటం చూసి ఆశ్చర్యపొయారు.


కానీ ఇలాటి వర్షం కురవడం ఇది మొదటిసారి కాదు....గత ఏడాది ప్రారంభంలో, మెక్సికో పట్టణమైన టామ్పికోలో చేపల వర్షం కురిసింది. భారతదేశంలోని కేరళా రాష్ట్రంలో 2008 లో ఇలాగా చేపల వర్షం కురిసింది.


ఫోటో క్రెడిట్: China’s national weather agency.

Friday, 15 June 2018

ఫిఫా వరల్డ్ కప్ 2018: ప్రపంచమంతా రెడీ అవుతున్న ఫుట్‌బాల్ మైదానాలు....ఫోటో ఫీచర్


ఫీఫా ప్రపంచ కప్ ఫిఫా వరల్డ్ కప్, అని పేరొందిన ఫుట్‌బాల్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో ఫుట్‌బాల్ ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుత విజేత జర్మనీ, బ్రెజిల్లో జరిగిన 2014 ఫీఫా ప్రపంచ కప్ లో అర్జెంటీనాను ఓడించి, కప్పును స్వంతం చేసుకుంది. 2018లో రష్యా దేశంలో జరుగుతోంది/ప్రారంభమయ్యింది.

ఫిపా ప్రపంచకప్ ప్రారంభించిన నేపథ్యంలో ప్రపంచమంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది....దీనికి ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ మైదానాలు రెడీ అయ్యాయి
Wednesday, 13 June 2018

డ్రాగన్ పుర్రె: శాప విమోచన పూవుల యొక్క భయానక స్వరూపం....ఫోటో సీరిస్


సాధారణంగా స్నాప్డ్రాగన్(snapdragon) అని పిలువబడే యాంటీరైనియం(Antirrhinum) పూలచెట్టు చాలా సంవత్సరాలుగా ప్రముఖమైన తోట మొక్కగా యూరోప్, అమెరికా మరియు ఉత్తర ఆఫ్రికా కొండ ప్రాంతాలలో పేరుపొందింది. డ్రాగన్ పువ్వు అని కూడా పిలువబడుతుంది. దాని సాధారణ పేరు పువ్వు యొక్క వర్ణనను డ్రాగన్ యొక్క తల వైపుకు తీసుకుంటుంది.

ఈ డ్రాగన్ పువ్వుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రాచీన సంస్కృతులు తెలుపుతున్నాయి. తోటలో నాటితే వంచన, శాపాలు మరియు మంత్రవిద్యల నుండి రక్షణ కలిపిస్తుందని భావించారు. మరొక పురాణం ప్రకారం ఈ పువ్వులను ఏ స్త్రీ అయితే తింటుందో ఆ స్త్రీకి అందంను పునరుద్ధరించుకునే శక్తి కలుగుతుందని చెబుతోంది. అయితే మంత్ర గత్తెలు వీటిని ఏ రోజు దుర్వినియోగపరచలేదట.

స్నాప్డ్రాగన్ మొక్కను తోటల్లో పెంచుకున్న వారు దయా గుణము మరియు మనోహరమైన అందము కలిగినవారై ఉంటరట. వయసుమల్లుతున్న మహిళలు ఈ పూవులనువాడితే వారికి యొవ్వనపు అందం తిరిగి వస్తుందట. వయసులో ఉన్న స్త్రీ వాడితే ఈ పువ్వులు పనిచేయవట.

ఏక్కువమంది తమను అదృష్టం వరిస్తుందని మాత్రమే ఈ పూల మొక్కను తమ తోటలో పెంచేవారట.
Tuesday, 12 June 2018

మార్బుల్ సిటీ....ఫోటో ఫీచర్


తుర్కమేనిస్తాన్ రాజధాని అష్గబత్ నగరాన్ని పాలరాయి నగరంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ నగరంలోని వందలాది ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ అపార్ట్ మెంట్స్...ఇటలీ నుండి దిగుమతి చేసుకోబడ్డ పాలరాయితో నిర్మించినవి. రాజధాని మధ్య ప్రాంతంలోని కొన్ని పాలరాయి భవనాలలో బంగారు అలంకారం కనిపిస్తుంది. తుర్కమేనిస్తాన్ సహజవాయువు ఎగుమతులవలన ఎంతగా సంపాదిస్తోందో తెలుసుకోవచ్చు.

తుర్కమేనిస్తాన్ ప్రపంచంలోనే పత్తి ఉత్పత్తిలో 10 వ స్థానం వహిస్తోంది. సాగుభూమిలో సగభాగం పత్తి పండిస్తారు. సహజ వాయువు నిల్వలు, చమురు నిల్వలలో తుర్కమేనిస్తాన్ దేశం ప్రపంచంలోనే ముడి చమురు ఉత్పత్తిలో 5 వ స్థానం వహిస్తొంది.

Monday, 11 June 2018

"గ్రేట్ ఎస్కేప్" అంటే ఇదే.....వీడియో


ఎదుగుతున్న యంత్రాలు....ఫోటో ఫీచర్


‘మేధస్సు’ మనిషి సొంతమని విర్రవీగే రోజులు ముగిసిపోతున్నాయి.


‘కృత్రిమ మేధస్సు’.....దాంతో పనిచేసే కంప్యూటర్లు, రోబోలు ప్రపంచాన్ని శాసించటానికి సిద్ధమైపోతున్నాయి. ఇవి ఇప్పటికే చాలా రంగాల్లో మనుషులతో పోటీపడే స్థాయికి చేరుకుంది.

ఆండ్రాయడ్ హ్యూమన్ రోబో

సర్వర్ రోబో
ఇప్పటివరకు మొబైల్ ఫోన్ పెద్ద విప్లవం అనుకుంటున్నాం. ప్రపంచ మొత్తాన్ని అరచేతిలో పట్టి చూపిస్తున్న ఈ పరిఙ్ఞానం ఓ అద్భుతమే. ఆ మోబైల్ ఫోనును వెనక్కి నెడుతూ యంత్రాల( రోబో మరియు కంప్యూటర్) రూపంతో కృత్రిమ మేధస్సు ఊపందుకుంది.

అంతరిక్షంలో పనిచేయాడానికి వెడుతున్న రోబోలు
యాంత్రిక విఙ్ఞానం గత 50 ఏళ్ళలో గణనీయంగా పెరిగింది. కంప్యూటర్ గణనశక్తి ఉరుకులు పరుగులుగా పరిగెడుతూండడంతో కంప్యూటర్ నిపుణులు కొందరు ఆకాశానికి నిచ్చనలు వేస్తున్నారు. 2035 నాటికి యాంత్రీక విఙ్ఞానం మానవ మేధస్సును అధిగమించగలదని చెబుతున్నారు.

ఈతకొట్టే రోబో
గత రెండు దశాబ్ధాలుగా కృత్రిమ మేధస్సు బాగా వ్రుద్ది చెందగలిగిందంటే అందుకు కారణం కంప్యూటర్ల పుణ్యమేనని చెప్పాలి. ఎందుకంటే వీటికి అందించిన డేటా సహాయంతో కంప్యూటర్లు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారాలు చూపగలిగాయి. ఇందుకు కారణం కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన 'ప్రాబబిలిస్టిక్ ప్రొగ్రామింగ్ ' విధానం. దీని వల్ల గ్రహించగలిగే మిషెన్లు (కంప్యూటర్లు) నిర్మించడం తేలికైయ్యింది.

కొరియర్ బాయ్ రోబో

హాస్పిటల్లో రోగులకు సహాయపడే రోబో

సెక్యూరిటీ రోబో

చీర్ లీడర్ రోబోలు

వంటచేస్తున్న రోబో