Wednesday, 30 May 2018

ఎడారిని ముంచెత్తిన వరదలు--ఒకే రోజులో మూడేళ్ల వర్షం....ఫోటోలు మరియు వీడియో


అరేబియా ఖాతంలో ఏర్పడిన తుఫాన ఓమన్ దేశాన్ని తడిపి ముంచెత్తింది. "మెకును" అని పేరు పెట్టబడిన ఈ తఫాన ధాటికి ఓమన్ నగరం అతాకుతలమయింది. తుఫాను ధాటికి ఓమన్‌లోని మూడో అతిపెద్ద నగరం సలాలాహ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

మూడేళ్ల వర్షం ఒకే రోజులో కురిసి ఎడారి ప్రదేశాన్ని తడిపి ముద్ద చేయడమే కాకుండా, అక్కడ జలపాతాలును కూడా ఏర్పర్చింది.

రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూగర్భ మార్గాలు చెరువులను తలపిస్తున్నాయి. ఓవైపు వరదలు మరోవైపు కరెంటు లేకపోవడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఓమన్‌లోని బీచ్‌లు నిర్మానుష్యంగా మారాయి. సొకొత్రాలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దక్షిణ ఒమన్లో గతంలో ఎన్నడూ నమోదుకాని తుఫాను, గల్ఫ్ దేశానికి, పొరుగున ఉన్న యామెన్ ను శనివారం తాకింది.


జపాన్ దేశం ఎందుకని ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తుంది....ఫోటోలుMost Japanese Schools Don’t Have Custodians. Instead, The Students Do The Cleaning Themselves As A Part Of Showing Gratitude To The School And Learning How To Become More Productive Members Of Society

This Is How Smooth The Bullet Train Is In Japan

Japan’s Manhole Covers Are Beautiful

You Can Often Find This Kind Of Toilet In Japan. Wash Your Hands And Reuse The Water For Your Next Flush

Japanese Fans Stayed Behind After The FIFA World Cup 2014 Match To Help Clean Up

Koi Fishes Even Live In Drainage Channels In Japan

Almost Everyone In Japan Reverse Parks

Children’s Seat On The Fujikyu Railway Line In Japan

Tokyo Commuters Waiting For Their Train

In Japan, The Ground Crew Bows And Waves Goodbye To The Departing Aircraft

Monday, 28 May 2018

అద్భుతమైన ఉప్పు సముద్రం/ప్లాటులు.....ఫోటోలు


ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఫ్లాట్స్/ఉప్పు సముద్రం/ఉప్పు అద్దాలు----బొలివియా దేశం లోని సాలార్ డి యునియిలో ఉన్నది. ఇది మరో విశ్వంలాగా కనబడుతుంది..అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భావాన్ని అనుభవించవచ్చు.

సూర్యుడు అందించిన మూడవ రాయి అని చెప్పబడే ఆ విచిత్ర ప్రదేశాన్ని చూడటానికి ఇప్పుడు మనం అక్కడకు వెల్దాము.

మీరు ఎప్పుడైనా మరొక గ్రహంను సందర్శించాలని కోరుకున్నారా..పర్సలో డబ్బులేక ఆగిపోయారా?ఒక వేల మరొక గ్రహంను సందర్శించాలనుకున్నా అక్కడకు వెళ్ళటానికి సంవత్సరాలు పడుతుంది. కాని ఇదే భూగోళంపై వేరే గ్రాహం లాంటి ప్రకృతి దృశ్య ప్రదేశం చూడాలంటే బొలివియా దేశం లోని సాలార్ డి యునియికు వెళ్లాల్సిందే.

ఈ స్థలం అపారమైనది. ఇది పన్నెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు ఫ్లాట్. అంతేకాదు, ఇది సముద్ర మట్టానికి మూడువేల ఏడు వందల మీటర్లు ఎత్తులో ఉన్నది. ప్రపంచంలో అత్యధిక ఉప్పు ఫ్లాట్లను కలిగి ఉంది. ఫోటోలో కనబడుతున్న ఉప్పు దిబ్బలు మనుష్యులు చేసినవి కావు. సహజంగా సంభవించిన దృగ్విషయం.

నలభై వేల సంవత్సరాల కు ముందు ఇక్కడ ఉప్పు నీటి సరస్సులు ఉండేవట. మూడు సరస్సులు ఇప్పటికీ ఉన్నాయి. మిగిలినవి ఎండిపోయినై. అయినా ఊట బాగా పైకెదిగి ఉప్పు అద్దాలు గానూ, గాలి వలన--ఉప్పు దిబ్బలు ఏర్పడతాయట.Sunday, 27 May 2018

ఘనా దేశం: ఎలక్ట్రానిక్ చెత్తకు రాజధాని....ఫోటోలు


ఎలక్ట్రానిక్ డంపింగ్ గ్రౌండ్ ఆఫ్ ది వరల్డ్ గా ఘనా దేశాన్ని చెబుతారు.

మొదటి ప్రపంచ దేశాలు ఉత్పాదించిన ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కడ ముగిస్తోంది? ఘనా మరియు చైనా, నైజీరియా, భారతదేశం, వియత్నాం మరియు పాకిస్తాన్ వంటి మూడవ ప్రపంచ దేశాలలో - కాని ఎక్కువగా ఘనా.

మొదటి ప్రపంచ దేశాలు ఉత్పాదించిన వందల మిలియన్ల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్రతి సంవత్సరం రవాణా చేయబడుతున్నాయి, ఘనా దేశంలో జరగుతున్న చట్టవిరుద్ధమైన ఈ ఇ-వ్యర్థాల వ్యాపారం ఆ దేశానికి స్వంత ఆర్థిక వ్యవస్థగా రూపొందింది.

పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ బంజర భూమి ఘనాలోని అక్రా అనేచోట ఉన్నది. సుమారు 3000 మంది ఇక్కడ పని చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి స్కావెంజెడ్ మెటల్ని అమ్మడం ద్వారా జీవిస్తారు. పాత టివిలు, కంప్యూటర్ మానిటర్లు, హార్డు డ్రైవులు మరియు కీబోర్డులు, డిస్క్, డ్రైవ్లు మరియు సర్క్యూట్ బోర్డుల నుండి కటకముల్లాంటి పునర్వినియోగ భాగాలుగాను తీసి అమ్ముతారు. ప్రపంచ స్క్రాప్ ధరలు పెరుగుతున్నందువలన, లోహాలకు అధిక గిరాకీ ఉంది. తీగలు మరియు ముద్రిత బోర్డులు రాగిని సంగ్రహించేందుకు వాటిని మంటలు వేసి కాలుస్తారు.

కానీ ఉపయోగకరమైన లోహాలను తిరిగి పొందే ప్రక్రియ చాలా విషపూరితం. లోహాలను తొలగించే కార్మికులు తరచూ ఎటువంటి రక్షక సామగ్రిని కలిగి ఉండరు. అధిక స్థాయిలో విషపూరిత రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇది వాతావరణ కాలుష్యానికి దారితీస్తోంది.