Tuesday, 15 May 2018

పాలమూరు పిల్లల మర్రికి చికిత్స...చిగురిస్తున్నఆకులు: ఫోటోలు మరియు వివరాలు


ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మర్రి వృక్షంగా 'పిల్లల మర్రి' పేరుగాంచింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అంటేనే ప్రథమంగా గుర్తుకు వచ్చేది 'పిల్లలమర్రి'నే. ఈ మహావృక్షం దాదాపు 3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టు మొదలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి విఫలమయ్యారు. చెదల వల్ల.. చెట్టు వేరు దెబ్బతినడంతో గతేడాది డిసెంబరులో ఈ చెట్టు నేలకొరిగింది. వెంటనే స్పందించిన అధికారులు చెట్టుకు చికిత్స ప్రారంభించారు. అధికారులు చేస్తున్న చికిత్స ప్రయత్నం ఫలిస్తోంది. ఇప్పుడిప్పడే ఈ వృక్షానికి ఆకులు చిగురిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో మహావృక్షం తిరిగి కోలుకునేందుకు మరింత చికిత్స అవసరమని అధికారులు అంటున్నారు. కొమ్మలు విరగకుండా ఉండేందుకు వాటి కింద సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

సుమారు 7౦౦- 8౦౦ సంవత్సరాల వయసున్న ఈ మర్రి చెట్టు చిగురించడం అక్కడున్న వారిని ఆనందపరిచింది.







No comments:

Post a Comment