Monday, 28 May 2018

అద్భుతమైన ఉప్పు సముద్రం/ప్లాటులు.....ఫోటోలు


ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఫ్లాట్స్/ఉప్పు సముద్రం/ఉప్పు అద్దాలు----బొలివియా దేశం లోని సాలార్ డి యునియిలో ఉన్నది. ఇది మరో విశ్వంలాగా కనబడుతుంది..అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భావాన్ని అనుభవించవచ్చు.

సూర్యుడు అందించిన మూడవ రాయి అని చెప్పబడే ఆ విచిత్ర ప్రదేశాన్ని చూడటానికి ఇప్పుడు మనం అక్కడకు వెల్దాము.

మీరు ఎప్పుడైనా మరొక గ్రహంను సందర్శించాలని కోరుకున్నారా..పర్సలో డబ్బులేక ఆగిపోయారా?ఒక వేల మరొక గ్రహంను సందర్శించాలనుకున్నా అక్కడకు వెళ్ళటానికి సంవత్సరాలు పడుతుంది. కాని ఇదే భూగోళంపై వేరే గ్రాహం లాంటి ప్రకృతి దృశ్య ప్రదేశం చూడాలంటే బొలివియా దేశం లోని సాలార్ డి యునియికు వెళ్లాల్సిందే.

ఈ స్థలం అపారమైనది. ఇది పన్నెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు ఫ్లాట్. అంతేకాదు, ఇది సముద్ర మట్టానికి మూడువేల ఏడు వందల మీటర్లు ఎత్తులో ఉన్నది. ప్రపంచంలో అత్యధిక ఉప్పు ఫ్లాట్లను కలిగి ఉంది. ఫోటోలో కనబడుతున్న ఉప్పు దిబ్బలు మనుష్యులు చేసినవి కావు. సహజంగా సంభవించిన దృగ్విషయం.

నలభై వేల సంవత్సరాల కు ముందు ఇక్కడ ఉప్పు నీటి సరస్సులు ఉండేవట. మూడు సరస్సులు ఇప్పటికీ ఉన్నాయి. మిగిలినవి ఎండిపోయినై. అయినా ఊట బాగా పైకెదిగి ఉప్పు అద్దాలు గానూ, గాలి వలన--ఉప్పు దిబ్బలు ఏర్పడతాయట.No comments:

Post a Comment