Wednesday, 16 May 2018

రగులుతున్న అగ్ని పర్వతం.....ఫోటోలు మరియు వీడియో


అమెరికాలోని హవాయి దీవుల్లో అతిపెద్దదైన అగ్నిపర్వతం తీవ్ర స్థాయిలో రగులుతుండడం, మరోవైపు వరుసగా సంభవిస్తున్న భూ ప్రకంపనలతో అక్కడ పరిస్థితి బీభత్సంగా తయారైంది. శుక్రవారం సంభవించిన భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు సంభవిస్తూనే వున్నాయి. ఐదు నిముషాలకోసారి రాత్రంతా అదే పరిస్థితి నెలకొందని ప్రజలు తెలిపారు. ఆ ప్రకంపనల తీవ్రత కూడా చాలా ఎక్కువగా వుంటోంది. ఇప్పటికే అగ్నిపర్వతం బద్దలై లావా, పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి వెలువడుతుండగా, తాజాగా భూకంపంతో మరోసారి అగ్నిపర్వతం నుండి లావా విరజిమ్ముతోంది. పైగా అత్యంత ప్రమాదకరమైన సల్ఫర్‌ వాయువు వెలువడు తుండడంతో వేలాదిగా ప్రజలను అక్కడ నుండి తరలించారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇళ్ళు బీటలు వారడం, భయ కంపితులైన ప్రజలు వీధుల్లోకి పరుగులు పెట్టడం, కొండరాళ్ళు విరిగిపడడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అగ్నిపర్వతానికి సమీపంలోని ప్రాంతాల్లోని ప్రజలను పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.










No comments:

Post a Comment