Saturday, 19 May 2018

బొమ్మ తలపై పెరుగుతున్న నిజమైన మానవ జుట్టు......మిస్టరీ(ఫోటోలు)


ఒకికు....దయ్యము పట్టిన బొమ్మ.

జపాన్ దేశంలోని ప్రధాన ఐదు దీవులలో ముఖ్యమైనది హొక్కిడో దీవి. ఈ దీవి లోని ఒక గుడిలో ఉంచబడిన ఈ బొమ్మ తలపైన జుట్టు పెరుగుతోందట. ఇది గమనించిన ఆలయ నిర్వాహకులు, ఈ బొమ్మను పరిశోధనలకు పంపితే జుట్టు పెరగడమే కాదు, పెరుగుతున్నది మానవ జుట్టు అని చెప్పారట.

1918 లో ఇకిచి సుజుకి అనే పదిహేడేళ్ళ బాలుడు, తన మూడేళ్ళ చెల్లెలు కోసం ఈ బొమ్మను కొన్నాడు. ఇది ఒక సాంప్రదాయ జపనీస్ బొమ్మ. ఆ పాప ఆ బొమ్మకు ఒకికు పేరు పెట్టి , ఆ బొమ్మను ఎప్పుడూ తనతో ఉంచుకునేది. ఈ పాప తన చిన్న వయసులోనే మామూలు జలుబు వ్యాధితో మరణించింది. చెల్లి మీద ప్రేమతో ఆ బొమ్మను తన దగ్గరే పెట్టుకున్నాడు అన్నయ్య.

ఆ బొమ్మ అప్పుడప్పుడు తనతో మాట్లాడుతోందని....తనకు భయంగా ఉందని ఆ బొమ్మను ఆ బాలుడు ఆ గుడికి తీసుకు వచ్చి ఇచ్చాడు.

ఆలయ నిర్వాహకులు అందంగా ఉన్న ఆ బొమ్మను వారి అధీనంలో ఉంచుకున్నారు. ఒక రోజు ఆ బొమ్మను తుడుస్తున్న ఒక నిర్వాహి ఆ బొమ్మ నెత్తిపై ఉన్న జుట్టు పెరిగియుండటం గమనించాడు.

ఆ రోజు నుంచి ఆ బొమ్మను చూడటానికి పర్యాటకులు రావడం మొదలయ్యింది. ఇప్పుడు ఆ బొమ్మ నెత్తిపై ఉన్న జుట్టు పొడుగుగా పెరిగిందట.

ఇది ఒక మిస్టరీ గా మిగిలి పోయింది.

No comments:

Post a Comment