Wednesday, 30 May 2018

ఎడారిని ముంచెత్తిన వరదలు--ఒకే రోజులో మూడేళ్ల వర్షం....ఫోటోలు మరియు వీడియో


అరేబియా ఖాతంలో ఏర్పడిన తుఫాన ఓమన్ దేశాన్ని తడిపి ముంచెత్తింది. "మెకును" అని పేరు పెట్టబడిన ఈ తఫాన ధాటికి ఓమన్ నగరం అతాకుతలమయింది. తుఫాను ధాటికి ఓమన్‌లోని మూడో అతిపెద్ద నగరం సలాలాహ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

మూడేళ్ల వర్షం ఒకే రోజులో కురిసి ఎడారి ప్రదేశాన్ని తడిపి ముద్ద చేయడమే కాకుండా, అక్కడ జలపాతాలును కూడా ఏర్పర్చింది.

రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూగర్భ మార్గాలు చెరువులను తలపిస్తున్నాయి. ఓవైపు వరదలు మరోవైపు కరెంటు లేకపోవడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఓమన్‌లోని బీచ్‌లు నిర్మానుష్యంగా మారాయి. సొకొత్రాలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దక్షిణ ఒమన్లో గతంలో ఎన్నడూ నమోదుకాని తుఫాను, గల్ఫ్ దేశానికి, పొరుగున ఉన్న యామెన్ ను శనివారం తాకింది.


No comments:

Post a Comment