Thursday, 28 June 2018

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రతిరోజూ పూజిస్తున్న భారతీయుడు....ఫోటో న్యూస్ ఆర్టికల్


డోనాల్డ్ ట్రంప్ యొక్క అత్యంత తీవ్రమైన మద్దతుదారులు అతనిని ఆరాధించేది రహస్యమేమీ కాదు. కానీ వారిలో ఎవరూ ఆయన్ని దేముడిగా పూజిస్తున్నరనేది వినలేదు. కానీ అలా ఒకతను పూజిస్తున్నాడు అనేది ఆసక్తికరమైన విషయమే.

గత మూడేళ్ళుగా భారత దేశంలో ఒక భారతీయ వ్యక్తి సరిగ్గా అదే చేస్తున్నాడట. ఇంతకీ అతను ఆయన మద్దత్తుదారుడు కూడా కాదట.


తెలంగాణ రాష్ట్రంలోని కొన్నే గ్రామానికి చెందిన 31 ఏళ్ల రైతు బుస్సా కృష్ణ. ఇతను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు ఫోటోకు రోజులో పలుసార్లు ప్రార్థన చేస్తాడు. చెక్క మందిరములో ఉంచిన ఆయన ఫోటోకు చందనం, పసుపు, పువ్వులతో పూజ చేస్తాడు. అతను ఎక్కడికి వెడుతున్నా పూజిస్తున్న ఆయన ఫోటోను తనతో పాటూ తీసుకు వెడుతూ ఆయన మీదున్న తన భక్తిని బహిరంగంగా ప్రకటిస్తాడు. అతని కుటుంబ శభ్యులు, మిత్రులు అతన్ని పిచ్చివాడని హేలన చేస్తున్నా అవేమీ పట్టించుకోడు...ఇప్పుడు ఆయనకు గుడి కూడా కడతానని చెబుతున్నాడు.


ఈ భారత రైతు డోనాల్డ్ ట్రంప్ ను దేముడిగా ఆరాధించడం ఎప్పుడు మొదలుపెట్టాడో స్పష్టంగా తెలియదు. కానీ ఇతను గత మూడు సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాడని TV9 న్యూస్ ఛానెల్ చెబుతోంది. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక వారి సమాచారం ప్రకారం రైతు బుస్సా కృష్ణ కు గత సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఆలొచన వచ్చిందని, దానికి కారణం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుచ్చిబొట్ల శ్రీనివాస్ చనిపోవటం, అది ద్వేషపూరిత చర్య అని ఆ ప్రభుత్వం చెప్పటం బుస్సా కృష్ణను కదిలించింది.


"నేను ఆ సంఘటనతో చాలా బాధపడ్డాను. అమెరికా అధ్యక్షుడు, ఆయన ప్రజలు భారతీయుల గొప్పతనాన్ని గ్రహించగలిగే ఏకైక మార్గం, వారి పట్ల మన ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడమే. అందుకే నేను ట్రంప్ ను పూజిస్తున్నాను. నా ప్రార్ధనలు ఆయనను ఒక రోజు చేరుకుంటాయనే ఆశతో" అని కృష్ణ అన్నారు"


"భారతీయులు వారి ఆధ్యాత్మిక శక్తులతో ఎవరినైనా గెలవగలరని నమ్ముతున్నాను. ఎంత శక్తివంతమైన వ్యక్తినైనా, మనం వారిని ప్రేమ మరియు ఆరాధనతో గెలువవచ్చు. నేను చేస్తున్నది అదే”


కృష్ణ తన ఫేస్‌ బుక్‌ పేజీలో ట్రంప్‌ కోసం చేస్తున్న పూజలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, దృశ్యాలను పోస్ట్‌ చేశారు. వీటిని అతని మిత్రులు ట్విటర్‌లోనూ ఉంచారు. తనను ఆరాధిస్తున్న కృష్ణ గురించి తెలుసుకున్న ట్రంప్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. కోట్ల మంది భారతీయుల్లో కృష్ణను తన అప్తమిత్రుడిగా భావిస్తున్నాననీ, త్వరలోనే కలుద్దామని పేర్కొన్నారు. దీనిపై కృష్ణ స్పందిస్తూ, తనకు ట్రంప్‌ అంటే ఎంతో అభిమానమన్నారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కాకముందు చాలా ఏళ్లక్రితం డబ్ల్యూడబ్ల్యూఈ అనే కార్యక్రమంలో హోస్ట్‌గా వచ్చేవారనీ, చాలా ఉత్సాహంగా పాల్గొనేవారనీ, తొలిసారిగా ఆయన్ని అక్కడే చూశానన్నారు. అప్పట్నుంచే ట్రంప్‌ అభిమానిగా మారానని తెలిపారు. ట్రంప్‌ లోని ముక్కుసూటితనం, చురుకుదనం తనకెంతగానో నచ్చుతాయనీ, ఆయన హావభావాలు తనలో విపరీతమైన ఉత్సాహాన్ని నింపేవన్నారు.

ఫోటో క్రెడిట్: హిందూస్తాన్ టైమ్స్

Wednesday, 27 June 2018

ఏ ఏ దేశాలలో తలసరి 1000 మంది కి ఎన్ని కార్లు ఉన్నాయీ తెలుసుకోండి....ఫోటో ఫీచర్


ఎంతమంది జనాభాకు ఎన్ని కార్లు ఉన్నాయో లెక్క వేయబడింది. అంటే తలసరి 1000 మంది కి ఎన్ని కార్లు ఉన్నాయి అని తెలుపుతోంది. కార్లు మాత్రమే సుమా...ఇందులో ఏ ఇతర మోటారు వాహనాలూ కలుపబడలేదు.

1) సాన్‌మారినో....1000 మందికి 1263 కార్లు

2) యునైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. 1000 మందికి 910 కార్లు

3) మొనాకో...1000 మందికి 899 కార్లు

4) న్యూజీలాండ్....1000 మందికి 774 కార్లు

5) లైచెన్‌స్టెయిన్ ..1000 మందికి 750 కార్లు

6) ఐస్ లాండ్...1000 మందికి 745 కార్లు

7) ఆస్ట్రేలియా...1000 మందికి 740 కార్లు

8) లక్సెంబర్గ్....1000 మందికి 739 కార్లు

9) మాల్టా...1000 మందికి 693 కార్లు

10) ఇటాలీ....1000 మందికి 679 కార్లు


ఇక పోతే భారత దేశంలో...1000 మందికి 50 కార్లు

Tuesday, 26 June 2018

మొక్కల యొక్క రేఖాగణితము....ఫోటో ఫీచర్


చుట్టూ ఉన్న మొక్కలను చూస్తే వాటి శాఖలు, ఆకులు మరియు పువ్వులు యాదృచ్ఛికంగా పెరుగుతున్నాయని అనుకుంటాము. కానీ అది నిజం కాదు. ప్రతి మొక్క యొక్క ప్రతి శాఖ, ఆకు, కాండం, మొగ్గ లేదా రేక పుట్టుకొచ్చే ప్రదేశాలు స్థిర సూత్రాలు మరియు ఖచ్చితమైన కొలతల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా మొక్కలలో నిర్మాణక్రమం కనబడుతుంది. వీటిలో ఎక్కువగా ఫైబొనాక్సీ వరస ఉంటుంది. ఇటాలియన్ గణిత శాస్త్రజ్ఞుడు లియోనార్డో పియాసా 13 వ శతాబ్దం ప్రారంభంలో మొక్కలలో రేఖాగణిత కొలతలు ఉన్నాయని పాశ్చాత్య ప్రపంచానికి ఈ మాయాజాలాన్ని పరిచయం చేశాడు. అందువలన దీనికి ఫైబొనాక్సీ వరస అని పేరుపెట్టారు. కానీ మొక్కలలో రేఖాగణిత కొలతలు ఉన్నాయని క్రీస్తు జన్మకు ముందు వంద సంవత్సరాల పూర్వమే పురాతన భారతీయ గణిత శాస్త్రవేత్తలు దీని గురించి మొదటిసారి వివరించారు.


ఫైబొనాక్సీ సీక్వెన్స్ లేక వరస గాబరా పెట్టేదిగా కనబడుతుంది గాని నిజానికి అది చాలా సులభం. ఇక్కడ ప్రతి సంఖ్యను ముందున్న సంఖ్యతో కలపడం ద్వారా సృష్టించబడింది, తద్వారా 1 1 2 3 5 8 13 21 నుండి మొదలవుతుంది. లెక్కపెట్టలేని సంఖ్య వరకు కొనసాగుతుంది. ఫైబొనాక్సీ సీక్వెన్స్ ప్రకృతిలో చాలా నిరంతరంగా ఉంటుంది. ఇది లేకుండా ఒక మొక్క గూడా ఉండదు.

ఇక్కడ కొన్ని ప్రసిద్ధ ఉదాహరణలు:


రెడ్ క్యాబేజిMonday, 25 June 2018

బౌద్ద దేవాలయాన్ని పసుపురంగుతో ముంచెత్తుతున్న 1,400 ఏళ్ల చైనీస్ జింగో ట్రీ డ్రాప్స్ (ఆకులు):....ఫోటోలు


జింగో ట్రీ అని పిలువబడే ఈ చెట్టుకు మరో పేరున్నది. బ్రతికున్న జీవస్థశిల. 200 మిల్లియన్ సంవత్సరాలుగా ఎటువంటి వాతావరణ ప్రభావానికి దెబ్బతినకుండా అలాగే ఉన్నది. మరోవిధంగా చెప్పాలంటే డైనాసర్లు భూమిని పరిపాలించునప్పటి నుండి ఈ చెట్టు ఉన్నదట.

Thursday, 21 June 2018

అసాధారణ సాగర తీరాలు....ఫోటో ఫీచర్


బీచ్ లంటే చాలామందికి ఇష్టం. అక్కడకు వెళ్ళాలన్నా, అక్కడ సమయం గడపాలన్నా చాలా మందికి సరదా. విదేశాలలో బీచ్ సన్ బాత్ వారికి ఉత్సహాన్ని,ఆనందాన్నీ ఇస్తుంది.బీచ్ లు చాలా అందమైనవి. ఉత్సాహభరితమైనవి. ప్రకృతిని ఆస్వాదించే అద్భుతమైన ప్రదేశాలు.

Black Sand Beach...Iceland

కుటుంబంతో సహా చాలా ఆనందంగా గడిపే సముద్ర తీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెడితే మనసు తెలికపడుతుంది. ఎందుకంటే బీచ్ లు ఆనందాన్ని పంచిపెడతాయి. అలాంటి సాగర తీరాలలో ఇసుక సాధారణంగా బంగారు రంగులో ఉంటుంది

Red Sand Beach....greece

కానీ ప్రపంచంలోని కొన్ని బీచ్ లలో ఇసుక రంగు వింత రంగులలో ఉన్నది. దీనిని ప్రకృతి వింతగా చూస్తున్నారు. అలాంటి వింత రంగు ఇసుకలు కలిగిన సాగరతీరాలను ఇక్కడ చూద్దాం.

Green Sand Beach.....Hawaii

Shell Beach....Australia

Purple Sand Beach.....California

Rainbow Beach.....Australia

Glass Beach.....California

Orange Cloured Sand Beach....Italy

Wednesday, 20 June 2018

మాయమైపోయిన మలేషియా ఏయిర్ లైన్స్ MH-370....మిస్టరీ...ఆర్టికల్


ఐదు సంవత్సరాల వెతుకులాట ముగింపుకు వచ్చింది...ఇక దొరకదని నిర్ణయానికి వచ్చిన అధికారులు.


మలేషియా ఏయిర్ లైన్స్ కు చెందిన MH-370 విమానం 8 మార్చ్2014 న అదృశ్యమైనదని అందరికీ తెలుసు. ఇది మలేషియా రాజధాణీ కౌలాలంపూర్ నుండి చైనా రాజధాణి బీజింగుకు వెళ్ళాలి. కానీ మార్గ మధ్యలో అదృశ్యమైంది.

2013 మార్చి లో అదృశ్యమైన ఈ విమానం ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో మొత్తం 239 మంది ప్రయాణీకులు మరణించారని మలేషియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రమాదం ఎక్కడ జరిగిందో, శకలాలు ఏమైనాయో మాత్రం తెలుపలేదు.


అదృశ్యమైపోవడానికి అదేమైనా చిన్న వస్తువా? సముద్రంలో పడిపోయిందా? దారి మళ్ళించారా? సముద్రంలో పడిపోయుంటే ఒక చిన్న ముక్క కూడా దొరకలేదా? అంతమంది ప్రయాణీకులలో ఒకరి దేహం కూడా దొరకలేదా? దారి మళ్ళించి ఉంటే అంతపెద్ద విమానం జాడ తెలియకుండా ఉంటుందా?...ప్రజలకు నచ్చజెప్పే సమాధనం చెప్పలేకపోవటం ఒక అరుదైన విషయం. అందుకే ఇది ఆధునిక మిస్టరీ.

విమానం మిస్సైన దగ్గర నుంచి 26 దేశాలు అవిశ్రాంతంగా దదాపుగా 20 శాతం భూగోళాన్ని జల్లెడ పట్టాయి. హిందూ మహసముద్రం, బంగాళాకాతం, అండమాన్ సముద్రాలను గాలించినా విమానం జాడ కనిపెట్టలేకపొయాయి.

అద్భుతమైన టెక్నాలజీ, అపారమైన అనుభవం గల అగ్రదేశాల సహకారం, నాసా ప్రతిభ ఏమీ చేయలేకపొయింది. విమానం జాడే తెలియకుండా పోయింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియకపోవడంతో సముద్రంలో పడిపోయిందని కొన్ని, హైజాక్ అయిందని మరికొన్నికధనాలు వచ్చాయి.

భూమిపైన ఏ మూలన ఏం జరుగుతోందో తెలుసుకోగల సత్తా అమెరికా మొదలుకుని ఎన్నో దేశాలకు ఉంది. అంతరిక్షంలో నివాసాలు సైతం ఏర్పాటు చేసుకునే టెక్నాలజీని అభివ్రుద్ది చేస్తోంది. ఆ ప్రతిభంతా ఎందుకూ కొరగాకుండా పోయిందా? హై టెక్నాలజీ ఉన్న నాసా సైతం చేతులెత్తేసింది! హఠాత్తుగా మాయమైన మలేషియా విమానం మన సాంకేతిక పరిజ్ఞ్నానికి ఒక సవాలుగా మారింది. ఆకాశం సదా అంతర్జాతీయ నిఘాలో ఉన్నప్పుడు ఒక విమానం అదృశ్యమవడం, దాని జాడ ఎవరికీ తెలియకపోవటం...ఎవరూ నమ్మలేకపోతున్నారు.


మలేషియా విమానం MH-370 గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని ఐ.రా.స. కు చెందిన సంస్థ CTBTO ప్రకటించింది. సమగ్ర (అణు) పరీక్షల నిషేద ఒప్పంద సంస్థ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కులిపోయిన జాడలను రికార్డు చేయలేదని ఐ.రా.స. సెక్రటరీ జెనరల్ బాన్-కి-మాన్ ప్రతినిధి డుజరిక్ ప్రకటించారు.

అదే సంవత్సరం జూలై-17న ఊక్రయిన్లోని తిరుగుబాటుదారులు మలేషియన్ ఏయర్ లైన్స్ కు చెందిన MH-17 విమానాన్ని కుల్చివేశారు. ఆ విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ మరణించారు. కూల్చివేయబడ్డ ఈ విమానమే అదృశ్యమైపోయిన MH-370 విమానం అని కొందరంటున్నారు. కారణం, "కూలిపోయిన MH-17 విమానంలోని చనిపోయిన వారందరి దేహాలమీద పాస్ పోర్టుల పోర్టులు అతికించబడి ఉన్నాయి" అని ఊక్రయిన్ తిరుగుబాటుదారుల కమాండర్ ఈగోర్ ఫిర్మిన్ తెలిపారు.

ఎవరైనా 239 ప్రయాణీకులున్న విమానాన్ని దొంగిలించి, ఆ విమానాన్ని 6 నెలలవరకు దాచిపెట్టగలరా? అందులోని శవాలను తీసి మరో విమానంలో, అందులోనూ వేరే దేశం నుండి బయలుదేరే విమానంలో పెట్టగలరా? ఇదంతా సాధ్యమయ్యే పనేనా?...అని కొట్టిపడేస్తున్నారు.


"MH-370 విమానం పాకిస్తాని తాలిబన్ నియంత్రిత ప్రదేశాలలో ఉండవచ్చు. ఈ ఖాలీ విమానాన్ని వెపెన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తో నింపి అమెరికాపై దాడి చేయవచ్చు" ఒక రిటైర్ద్ అమెరికా మిలటరీ జెనెరల్ ఫాక్స్ న్యూస్ ఛనెల్ ఇంటర్ వ్యూలో తెలిపారు.


"వియత్నాం దగ్గరలో చైనా మిలటరీ MH-370ని సబ్ మరైన్ క్షిపణులతో కూల్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్న కొందరిని చైనా హత్య చేయాలనుకున్నది" అని బ్రిటీష్ బారిస్టర్ Michael Shrimpton అన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విమాన శకలాలు అక్కడ దొరికి ఉండాలి. మొట్టమొదట అక్కడే ఈ విమానం కోసం వెతికారు. ఏమీ దొరకలేదు.

అదృశ్యమైన MH-370 విమానంలో ఆమెరికా టెక్నాలజీ కంపెనీ ’ ఫ్రీ స్కేల్ సెమి కండక్టర్’ కు చెందిన 20 ఉద్యోగస్తులు ప్రయాణం చేస్తున్నారు. ఈ కంపెనీ అత్యంత శక్తివంతమైన మైక్రో చిప్స్ ను తయారుచేస్తోంది. వాటిని రక్షణ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన పరిశ్రమలకు అందిస్తున్నారు. ఈ ఉద్యోగస్తుల దగ్గర ఈ పరిశ్రమలకు చెందిన రహస్య సమాచారం ఉంది. ఈ ఉద్యోగస్తులు చైనా గూఢాచారుల చేతిలో చిక్కుకుంటారేమోనని అమెరికానే విమానాన్ని దారి మళ్ళించి ఉంటుందని కొందరు ఊహిస్తుంటే, కాదు ఆ ఉద్యొగస్తులను చైనా మిలటరీ కిడ్నాప్ చేయడానికి విమానాన్ని హైజాక్ చేసి తీసుకువెళ్ళుంటారని మరికొందరు ఊహిస్తున్నారు.


అసలు ఇది సాధ్యమా అంటే "సాధ్యమే. ఈ మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో హ్యూగో టీసో అనే టెక్నాలజీ నిపుణుడు ఒక మొబైల్ ఫోనుతో విమానాలను ఎలా దారి మళ్ళించవచ్చో చేసి చూపించాడు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని, ఇంకొక విమానం నీడలో ఈ విమానాన్ని దారి మళ్ళించే అవకాశం ఉన్నది" అని ఇండి పెండంట్ పేపర్లో ఒక వ్యక్తి రాశారు.

మలేషియన్ ఏయర్ లైన్స్ విమానం MH-370 అదృశ్యమవటానికి కారణం ఏదైనా, అందులో ప్రయాణం చేసిన వారి గతి ఏమిటనేదే ప్రతి ఒక్కరి ఆవేదన. విమానం ఏమైందో బయట ప్రపంచానికి తెలిసేవరకు ఇదొక మిస్టరీగా మిగిలిపోతుంది.