Friday, 1 June 2018

నిమ్మకాయ ముక్కల వలన లభించు 5 ముఖ్య ఆరొగ్య లాభాలు....వివరాలు


దాదాపు ప్రతి క్లీనింగ్ ప్రాడక్ట్ లేదా ప్రతి శుభ్రపరిచే లేదా ప్రతి శుద్ధీకరణ వస్తువు యొక్క ముఖ్య మిశ్రమ అంశం నిమ్మరసం గానే ఉంటుంది. నిమ్మరసం వాసన మానవులలో ఉత్సాహాన్ని పెంచి, ఉత్తేజ పరుస్తుందనే వరకు మాత్రమే కాకుండా అనేక ఆరొగ్య లాభాలను అందిస్తుందని పరిశోధనలు తెలుపు తున్నాయి. అందులో మనం ఇంతవరకు తెలుసుకోని 5 ముఖ్య ఉపయొగాలను తెలుసుకుందాం.


ఈ 5 ఆరొగ్య లాభాలను కేవలం నిమ్మకాయ ముక్కలను మీరు నిద్ర పోయేటప్పుడు మీ పక్కన ఉంచుకుంటే చాలు...5 ఆరొగ్య లాభాలను పొందవచ్చు.

ఒక నిమ్మకాయను నాలుగు భాగాలుగా చేసి, భాగాలపై కొద్దిగా ఉప్పు అద్ది రెడిగా ఉంచుకోండి.

ఒత్తిడి నుండి ఉపశమనం:

నిద్ర పోయే సమయం ఆ రొజుకు సేదతీర్చు సమయం గా ఉండాలి. అలాంటిది, చాలా మందికి సేదతీర్చు సమయం మరింత ఒత్తిడి సమయంగా మారుతుంది. అనవసరమైన ఆలొచనలు, భయాలు, ఆందోళణలు వారిని నిద్రలోకి జారనివ్వవు....నాలుగు భాగాలుగా చేసి, ఉప్పు అద్దిన నిమ్మకాయ ముక్కలను మీరు నిద్రపొయే చోటుకు దగ్గరగా పెట్టుకోండి. పరిశోధనల ప్రకారం సిట్రస్ మరియు నిమ్మ వాసన మీ మెదడును శాంతపరుస్తుంది. మీ నరాలు మరియు మీలోని భావోద్వేగాలను శాంత పరుస్తుంది.....మీకు నిద్ర పడుతుంది.

మెరుగైన దృష్టి:

మామూలుగా నిద్రవేళ మనిషి భవిష్యత్‌ పై దృష్టి పెట్టటానికి ప్రతికూలంగా ఉంటుంది. కాని నిద్రలేమితో బాధపడుతున్నవారు నిద్రవేళ భవిష్యత్‌ పై దృష్టి పెట్టలేరు. ముక్కలు చేసిన నిమ్మకాయలను దగ్గర ఉంచుకోవడం వలన మీకు భవిష్యత్‌ పై దృష్టి పెట్టే ప్రతికూల వాతావరణం మీ మెదడులో ఏర్పడుతుంది.

మెరుగైన శ్వాస:

ఎప్పుడైనా మీకు జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ ఏర్పడి మీరు శ్వాస పీల్చుకోవటానికి ఇబ్బంది పడతారు. నిద్రలో మన ఉచ్వాసనిశ్వాసలు సహజంగా జరగాలి. ముక్కు దిబ్బడ వలన అది సహజంగా ఉండదు. కొంచం కష్టపడవలసి వస్తుంది......నిమ్మకాయ ముక్కలలో యాంటీ-బ్యాక్టీరియల్ మరియు యాంటీ-ఆక్సిడైజింగ్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ముక్కు దిబ్బడ మరియు సైనస్ బడ్స్ క్లియర్ అవుతుంది. అప్పుడు ఉచ్వాసనిశ్వాసలు సహజంగా జరుగుతుంది.

కీటక నాశిని:


నిద్రను భంగపరిచే జీవుల్లో ముఖ్యమైనది దోమ...ముక్కలు చేసిన నిమ్మ తొనలను మీ పక్కన ఉంచుకుంటే దోమలనే కాదు మిగిలి ఉన్న ఏ క్రిమినైన సరే నాశనం చేసి విలువైన నిద్ర పోవటానికి సహాయపడుతుంది.

ఉదయం మరింత శక్తి మరియు పాజిటివ్ వైబ్స్:

ఉదయాన్నే నిద్ర లేవటం చాలా మందికి ఒక కష్టమైన పనిగానే ఉంటుంది....కానీ నిమ్మకాయల ముక్కలు మీరు ఉదయాన్నే నిద్రలేవటానికి కావలసిన శక్తిని అందిస్తుంది.

నిమ్మకాయ సువాసన మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది, సెరిటోనిన్ మీరు సంతోషంగా, ఉత్సాహంగా నిద్రలేవటానికి, ఉదయం ప్రతికూలమైన ఆలోచనా విధానాలను, అలొచించగల శక్తిని ఇస్తూ మీలోని నెగటివ్ ఎనర్జీని తీసి పారేస్తుంది.

No comments:

Post a Comment