Sunday, 10 June 2018

సౌరశక్తి వాహనాలు....ఫోటో ఫీచర్


కాంతిని విద్యుత్ శక్తికి మళ్ళించి గెలిచాడు మానవుడు. సౌర విద్యుత్ శక్తి ఇప్పుడు కాయే కావచ్చు....అది పండై భవిష్యత్తును పండించబోతోంది. వాహన ఇంధన అవసరాలకు ఫలం కాబోతోంది. భవిష్యుత్ ప్రయాణానికి రెడి అవుతున్నాయి సౌర వాహనాలు.


అతి త్వరలోనే భూమి మీది పెట్రోలియం నిల్వలన్నీ ఖాలీ అయిపోతాయని శాస్త్రవేత్తలు లెక్క కట్టేశారు. 2052 కు అని ఒక బ్రుందం, 2067 కు అని మరో బ్రుందం ....లెక్కల్లో తెడానే గానీ విషయం ఒకటే. త్వరలో మన భావితరం పెట్రోల్ బంకు అనే మాటను పుస్తకాల్లో చదువుతారనేది చెప్పక్కర్లేని నిజం. 30 కోట్ల ఏళ్ళుగా భూమి తయారు చేసిన ఇంధన్నానంతటినీ కేవలం 200 ఏళ్ళాలో ఖాలీ చేసాం.


క్రూడ్ యుగం నుంచి సోలార్ యుగంలోకి మనిషి ప్రయాణం చేయాలనేది తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సౌరశక్తే ప్రధాన వనరు. సౌరశక్తితో నడిచే ఉపగ్రహాలు పక్కాగా పనిచేస్తున్నాయి. మార్స్ పైకి, చంద్రుని పైకి పంపిన కొన్ని రోవర్లకు సౌరశక్తే ఇంధనం.


అంతరిక్షంలో సూర్యకాంతి తేలికగా సేకరించగలగడమే దీనికి ప్రధాన కారణం. కానీ సమస్యల్లా భూమి మీదే. కొన్ని గంటులు మాత్రమే సూర్యుడి వెలుగు అందుబాటులో ఉంటుంది. మేఘాల అడ్డుగోడలు, శీతల ప్రాంతాల సవాళ్ళు, రాత్రుల చీకటి....సౌర వాహనాల ప్రగతికి ప్రధాన అడ్డంకులు. వీటన్నింటినీ ఛేదించి సౌరశతి వాహనాలు తయారుచేస్తున్నారు.







No comments:

Post a Comment