Tuesday, 12 June 2018

మార్బుల్ సిటీ....ఫోటో ఫీచర్


తుర్కమేనిస్తాన్ రాజధాని అష్గబత్ నగరాన్ని పాలరాయి నగరంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ నగరంలోని వందలాది ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ అపార్ట్ మెంట్స్...ఇటలీ నుండి దిగుమతి చేసుకోబడ్డ పాలరాయితో నిర్మించినవి. రాజధాని మధ్య ప్రాంతంలోని కొన్ని పాలరాయి భవనాలలో బంగారు అలంకారం కనిపిస్తుంది. తుర్కమేనిస్తాన్ సహజవాయువు ఎగుమతులవలన ఎంతగా సంపాదిస్తోందో తెలుసుకోవచ్చు.

తుర్కమేనిస్తాన్ ప్రపంచంలోనే పత్తి ఉత్పత్తిలో 10 వ స్థానం వహిస్తోంది. సాగుభూమిలో సగభాగం పత్తి పండిస్తారు. సహజ వాయువు నిల్వలు, చమురు నిల్వలలో తుర్కమేనిస్తాన్ దేశం ప్రపంచంలోనే ముడి చమురు ఉత్పత్తిలో 5 వ స్థానం వహిస్తొంది.

No comments:

Post a Comment