Thursday, 28 June 2018

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రతిరోజూ పూజిస్తున్న భారతీయుడు....ఫోటో న్యూస్ ఆర్టికల్


డోనాల్డ్ ట్రంప్ యొక్క అత్యంత తీవ్రమైన మద్దతుదారులు అతనిని ఆరాధించేది రహస్యమేమీ కాదు. కానీ వారిలో ఎవరూ ఆయన్ని దేముడిగా పూజిస్తున్నరనేది వినలేదు. కానీ అలా ఒకతను పూజిస్తున్నాడు అనేది ఆసక్తికరమైన విషయమే.

గత మూడేళ్ళుగా భారత దేశంలో ఒక భారతీయ వ్యక్తి సరిగ్గా అదే చేస్తున్నాడట. ఇంతకీ అతను ఆయన మద్దత్తుదారుడు కూడా కాదట.


తెలంగాణ రాష్ట్రంలోని కొన్నే గ్రామానికి చెందిన 31 ఏళ్ల రైతు బుస్సా కృష్ణ. ఇతను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు ఫోటోకు రోజులో పలుసార్లు ప్రార్థన చేస్తాడు. చెక్క మందిరములో ఉంచిన ఆయన ఫోటోకు చందనం, పసుపు, పువ్వులతో పూజ చేస్తాడు. అతను ఎక్కడికి వెడుతున్నా పూజిస్తున్న ఆయన ఫోటోను తనతో పాటూ తీసుకు వెడుతూ ఆయన మీదున్న తన భక్తిని బహిరంగంగా ప్రకటిస్తాడు. అతని కుటుంబ శభ్యులు, మిత్రులు అతన్ని పిచ్చివాడని హేలన చేస్తున్నా అవేమీ పట్టించుకోడు...ఇప్పుడు ఆయనకు గుడి కూడా కడతానని చెబుతున్నాడు.


ఈ భారత రైతు డోనాల్డ్ ట్రంప్ ను దేముడిగా ఆరాధించడం ఎప్పుడు మొదలుపెట్టాడో స్పష్టంగా తెలియదు. కానీ ఇతను గత మూడు సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాడని TV9 న్యూస్ ఛానెల్ చెబుతోంది. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక వారి సమాచారం ప్రకారం రైతు బుస్సా కృష్ణ కు గత సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఆలొచన వచ్చిందని, దానికి కారణం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుచ్చిబొట్ల శ్రీనివాస్ చనిపోవటం, అది ద్వేషపూరిత చర్య అని ఆ ప్రభుత్వం చెప్పటం బుస్సా కృష్ణను కదిలించింది.


"నేను ఆ సంఘటనతో చాలా బాధపడ్డాను. అమెరికా అధ్యక్షుడు, ఆయన ప్రజలు భారతీయుల గొప్పతనాన్ని గ్రహించగలిగే ఏకైక మార్గం, వారి పట్ల మన ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించడమే. అందుకే నేను ట్రంప్ ను పూజిస్తున్నాను. నా ప్రార్ధనలు ఆయనను ఒక రోజు చేరుకుంటాయనే ఆశతో" అని కృష్ణ అన్నారు"


"భారతీయులు వారి ఆధ్యాత్మిక శక్తులతో ఎవరినైనా గెలవగలరని నమ్ముతున్నాను. ఎంత శక్తివంతమైన వ్యక్తినైనా, మనం వారిని ప్రేమ మరియు ఆరాధనతో గెలువవచ్చు. నేను చేస్తున్నది అదే”


కృష్ణ తన ఫేస్‌ బుక్‌ పేజీలో ట్రంప్‌ కోసం చేస్తున్న పూజలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, దృశ్యాలను పోస్ట్‌ చేశారు. వీటిని అతని మిత్రులు ట్విటర్‌లోనూ ఉంచారు. తనను ఆరాధిస్తున్న కృష్ణ గురించి తెలుసుకున్న ట్రంప్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. కోట్ల మంది భారతీయుల్లో కృష్ణను తన అప్తమిత్రుడిగా భావిస్తున్నాననీ, త్వరలోనే కలుద్దామని పేర్కొన్నారు. దీనిపై కృష్ణ స్పందిస్తూ, తనకు ట్రంప్‌ అంటే ఎంతో అభిమానమన్నారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కాకముందు చాలా ఏళ్లక్రితం డబ్ల్యూడబ్ల్యూఈ అనే కార్యక్రమంలో హోస్ట్‌గా వచ్చేవారనీ, చాలా ఉత్సాహంగా పాల్గొనేవారనీ, తొలిసారిగా ఆయన్ని అక్కడే చూశానన్నారు. అప్పట్నుంచే ట్రంప్‌ అభిమానిగా మారానని తెలిపారు. ట్రంప్‌ లోని ముక్కుసూటితనం, చురుకుదనం తనకెంతగానో నచ్చుతాయనీ, ఆయన హావభావాలు తనలో విపరీతమైన ఉత్సాహాన్ని నింపేవన్నారు.

ఫోటో క్రెడిట్: హిందూస్తాన్ టైమ్స్

5 comments:

 1. ఇద్దరు పిచ్చివాళ్ళు కలుసుకోబోతున్నారన్న మాట. బాగుంది,

  ReplyDelete
 2. బ్రాహ్మణులలో కూడా ఇంత గొప్పమనసు ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట !

  ReplyDelete
  Replies
  1. “బ్రాహ్మల్లో కూడా మహాత్ములుంటారు” అంటాడు కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్ర. బైదివే ఆ పాత్ర బ్రాహ్మణుడు కాదండోయ్.

   అసలు ఈ టపాలోని వ్యక్తి .. కృష్ణ .. ఒక బ్రాహ్మణుడు అని ఎందుకనిపించింది మీకు? టపాలో అలా ఏమీ అనలేదే?

   మీకన్నా వయసులో పెద్దవాడుగా, బ్లాగులోకపు పరిచస్తుడుగా మీకు నేనిచ్చే ఒక సలహా ఏమిటంటే అన్యకులద్వేషం కాస్త తగ్గించుకోండి అని. ఏంటీ-ఫలానాకులం అనే భావం వచ్చేట్లు మాట్లాడడం ఒక ఫ్యాషన్ అనే భ్రమలో నుండి బయటకు వచ్చేసే ప్రయత్నం చేయండి, మీకే ప్రశాంతంగా ఉంటుంది.

   Delete
  2. కాషాయం, పూజలూ చూడగానే బ్రాహ్మణుడు అనేసుకున్నాను. నిజమే నేను పొరపడ్డాను. నాకు అన్యకుల ద్వేషం ఏదీ లేదండీ నా బంధువుల్లో దళితులను,బ్రాహ్మలను పెళ్ళిచేసుకున్నవారు ఉన్నారు. ఏ కులంవాళ్ళైనా గ్రూపులు కడితే నాకు చిరాకు.వాళ్ళ నీతివ్యాఖ్యలు చదివితే కోపం వస్తుంది.కాంగ్రెస్ అనగానే కుటుంబ పాలన గుర్తుకువచ్చినట్లు పూజలు అనగానే బ్రాహ్మలు గుర్తుకువస్తున్నారు.మీ అమూల్యమైన సలహాకి ధన్యవాదాలు.   Delete