Thursday, 7 June 2018

గ్లోబల్ ఇబ్బందులను పరిష్కరించే ఉదాహరణలు.....ఫోటో ఆర్టికల్


చెత్త, కాలుష్యం, ఆకలి, నిరాశ్రయం...ఇవన్నీ లేని ప్రపంచాన్ని ఊహించుకుంటేనే మనందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రపంచ సంక్షోభ పరిస్థితి, పెరుగుతున్న జనాభా, సాంకేతిక పురోగతి కారణంగా మనం ఊహించుకునే ప్రపంచాన్ని సృష్టించుకోలేమా?. అదృష్టవశాత్తూ మనం ఊహించుకుంటున్న ప్రపంచాన్ని మనం సృష్టించుకునే అవకాశం మనకి ఇంకా ఉన్నది. కొన్ని దేశాలు ఇప్పటికే ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నాయి. వాటినే ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరూ వారివారి పరిసరాలను శ్రద్ధగా చూసుకుంటూ, ప్రకృతి స్వభావాన్ని గౌరవించి, పర్యావరణం గురించి జాగ్రత్త తీసుకుంటే, మనము జీవిస్తున్న గ్రహం రక్షించబడుతుంది.

విచ్చలవిడి జంతువుల సంరక్షణ:
చాలామంది ప్రజలు, ముఖ్యంగా పిల్లలు నిరాశ్రయు జంతువులను చూసినప్పుడు బాధపడతారు. ప్రతిజీవికి ఆశ్రయం,తిండి, ఉండటానికి చోటూ దొరికితే నిరాశ్రయంగా తిరిగే జంతువులను చంపే అవసరమే ఉండదు. పరిష్కారాన్ని కనుగొన్న దేశాలు: ఆస్ట్రియా, జర్మనీ, చెక్ రిపబ్లిక్ దేశాలు.ఈ దేశాలలో విచ్చలవిడి జంతువులను చూడలేము. మంచి వ్యవస్థీకృతమైన జంతు సంరక్షణ వ్యవస్థ ఈ ఫలితాన్ని సాధించటానికి సహాయపడింది. ప్రతి జంతువుకు దాని హక్కులు ఉన్నాయి. ఉల్లంఘన జైలు శిక్షతో సహా తీవ్రమైన శిక్షకు దారి తీస్తుంది. ఉదాహరణకి, చెక్ రిపబ్లిక్ లో, ఇది స్థానిక పోలీస్ యొక్క బాధ్యత. జంతువులను చంపుట స్థానిక చట్టం ద్వారా నిషేధించబడింది.

చెత్తను సరికూర్చటం:
ప్రపంచంలో ఎంత ఎక్కువమంది ప్రజలు ఉన్నారో, అంత ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతుంది. మనలో చాలామంది వారు పారేస్తున్న చెత్తకు ఏమి జరిగిందో కూడా ఆలోచచించరు. కొంతమంది డ్రైనేజ్ లో పడేసి హమ్మయ్య అనుకుంటారు.పరిష్కారాన్ని కనుగొన్న దేశాలు: జపాన్లోని కమికాత్సూ నగరం చెత్తను వదిలించుకోవడానికి అవకాశం ఉన్నట్లు ఉదాహరణతో నిరూపించింది. అయితే, అది అంత సులభం కాదు. ప్రతి పౌరుడు వారి చెత్తను బయట ఎలా వేయాలో వివరణాత్మక వర్ణనతో 27 పేజీల సూచనలను ఇచ్చారు. దీని ప్రకారం, చెత్తను వేర్వేరు కంటెయినర్లలో వేరుగా వేయాలి. ప్రయత్నాలు అద్భుతమైన ఫలితం చూపించాయి - 80% చెత్తను రీసైకిలింగుకు వాడారు, మిగిలిన 20% ఎరువులుగా ఉపయోగించారు. ఊహించుకోండి. చెత్తే లేని నగరం - ఈ నగరం నిజంగా ఉంది! ఈ వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శాన్ డియాగో 2030 నాటికి చెత్త మొత్తంని 75% తగ్గించి, 2040 నాటికి పూర్తిగా వదిలించుకోవడానికి తన ప్లాన్ ప్రకటించింది. న్యూయార్క్ నగరం కూడా పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది. 15 సంవత్సరాలలొ క్లీన్ సిటీ అని నిరుపించుకుంటానని శపధం చేసింది.

గాలిని శుభ్రపరచుట:
గ్లోబల్ ఇబ్బందులులోనే పెద్ద ఇబ్బంది వాయు కాలుష్యం. అనేక మంది దీనికి పరిష్కారం లేదని నమ్ముతారు. డచ్ చిత్రకారుడు డాన్ రూజ్గార్డే, ఇంజినీర్లతో కలిసి స్మాగ్ ఫ్రీ టవర్ను నిర్మించారు. ఇఒనిజతిఒన్ టెక్నాలజీతో నిర్మించబడ్డ ఈ టవర్ గంటకు 30,000 చదరపు మీటర్ల వాయుకాలుష్యాన్ని శుభ్రపరుస్తుంది. రెగ్యులర్ వాటర్ హీటర్ ఎంత శక్తిని ఉపయోగించుకుంటోందో, అంతే శక్తిని ఈ స్మాగ్ ఫ్రీ టవర్ ఉపయోగించుకుంటుంది. శుద్ధి ప్రక్రియలో, ఘన మలినాలను నొక్కిపెడతారు, ఇవి నగల ఉత్పత్తిలో ఉపయోగించబడతాయి. ఇది ఇప్పటికే చైనాలో పరీక్షించబడింది.ప్రస్తుతం అనేక యూరోపియన్ నగరాల్లో ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిస్థితిని మెరుగుపరుస్తోంది.

విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడం:
అటామిక్, చమురు, గ్యాస్ పవర్ స్టేషన్లు పర్యావరణాన్ని చెడు మార్గంలో ప్రభావితం చేస్తున్నాయి. ఇవి వినియోగించే విద్యుత్తు వలన కరెంటు బిల్లులు పెరుగుతన్నాయి. అయినప్పటికీ, ఆధునిక వ్యక్తి విద్యుత్ లేకుండా జీవించలేడు. పరిష్కారం కనుగొన్న దేశాలు: శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు కోసం నిరంతరం శోధిస్తున్నారు. అనేక దేశాలు ప్రస్తుతం అణుశక్తి కేంద్రాలను నిర్మించటానికి నిరాకరిస్తున్నాయి. ఉదాహరణకు, ఇటలీ, అన్ని అణు విద్యుత్ స్టేషన్లను మూసివేసింది. పూర్తిగా అణు శక్తిని ఉపయోగించడానికి నిరాకరించింది. బెల్జియం, జర్మనీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ మరియు తైవాన్ దాని ఉదాహరణను అనుసరిస్తున్నాయి. పునరుత్పాదక మూలాలపై ఆధారపడిన పవర్ ప్లాంట్స్, పర్యావరణం నుండి మరియు ఆర్థిక దృక్పథం నుండి ఏర్పడే ఖర్చులను తగ్గిస్తాయి. జర్మనీ దేశంలో కరెంటు వాడుకున్నందుకు ప్రభుత్వం ప్రజలకు డబ్బులిస్తోంది. కారణం, గాలి 39,190 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 40 అణు రియాక్టర్లకు సమానం. ఈ శక్తి జర్మనీలో సగ భాగానికి సరిపోతుంది. గాలి విద్యుత్తు ఉత్పత్తి రికార్డులను విచ్ఛిన్నం చేస్తే, విద్యుత్ ధరలు సున్నాకి పడిపోతాయి. అలాంటి పరిస్థితులలో, శక్తిని ఉత్పత్తి చేసేవారు ఉత్పత్తి స్టేషన్లను మూసివేయవలసి ఉంటుంది.

అంతరించిపోతున్న జంతువులను రక్షించడం:
శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, భూగ్రహం మీద మానవులే లేకపోతే జంతువుల సంఖ్య పెరుగుతుంది. జంతువులే లేకపోతే, మానవులు బ్రతకలేరు. దురదృష్టవశాత్తు, ప్రతి సంవత్సరం కొత్త జంతు జాతులు వస్తున్నా, జంతు సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం మానవులు మాత్రమే! పరిష్కారం కనుగొన్న దేశాలు: చాలామంది ప్రజలు స్నేహపూర్వక జంతువుల అందమైన వీడియోలను చూడటానికి ఆశపడతారు. కానీ జంతు జనాభాను నాశనం చేయడం కూడా చేస్తున్నారు. చైనాలో అంతరించిపోతున్న జంతు జాతిని ఎవరైనా వేటాడితే ఉరిశిక్ష వేస్తారు.

ఉచితంగా ఉత్పత్తులను పంపిణీ చేయడం:
ఉత్పత్తుల్లో గడువు(expiry)ముగింపు తేదీ దగ్గరకు వచ్చినప్పుడు సాధారణంగా సూపర్ మార్కెట్లు ఏమి చేస్తాయి? ధరలను తగ్గిస్తాయి.ముగింపు తేదీ అయిపోతే పారేస్తారు. అంతే కానీ చిన్న ఆదాయంతో ఉన్న ప్రజలకు సహాయం చేయరు. పరిష్కారం కనుగొన్న దేశాలు: పరిష్కారం కనుగొన్న దేశాలలో జర్మనీ మొదటి దేశం. ఈ దేశంలోని దుకాణ యజమానులు గడువు(Expiry)ముగింపు తేదీ దగ్గరకు వచ్చినప్పుడు ఉత్పత్తులను ఉచితంగా విడుదల చేయటం ప్రారంభించారు....అలాగే, జర్మనీలో, మీరు "టఫెల్" లేదా ఆహార బ్యాంకు వంటి దుకాణాలను చూడవచ్చు. € 1 నుంచి € 2 కు మధ్య ప్రవేశ రుసుము చెల్లించి, గడువు(expiry)ముగింపు తేదీ దగ్గరకు వచ్చిన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు.

ప్రజల ఆనందాన్ని కాపాడటం:
కేవలం ఒక మంత్రిత్వ శాఖను సృష్టించి, జాతీయ విధానంలో పౌరుల సంతోషాన్ని కాపాడే భాద్యత ఆ శాఖ తీసుకుంటే, అప్పుడు అనేక సమస్యలు తాముగా అదృశ్యమవుతాయి. పరిష్కారం కనుగొన్న దేశాలు: దుబాయ్. "మీ దేశానికి హ్యాపీనెస్ మంత్రిత్వ శాఖ ఎందుకు అవసరమయ్యింది?"అని ఆదేశం యొక్క షీక్ ని ఒక ప్రశ్న అడిగితే... "నా ప్రజలకు మెరుగైన జీవితం కావాలి. మంచి విద్యను ఇవ్వాలి. ఉత్తమ ఔషధం మరియు ఆరోగ్యకరమైన చికిత్స ఇవ్వాలి." ఇదే విధమైన మంత్రిత్వ శాఖ ఉన్న రెండవ దేశం భూటాన్.

పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించడానికి మనలో ప్రతి ఒక్కరూ చేయగల అంశాలు అనేకం ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ప్రకృతిని సంరక్షించడానికి మన స్వంత అవగాహన పెంచుకోవాలి మరియు మన చుట్టూ ఉన్నవారి అవగాహన పెరగడానికి సహాయపడాలి. ప్రకృతిని మనం గౌరవిస్తే, ప్రకృతి తిరిగి ప్రతిఫలము అందిస్తుంది.
ఆధునిక టెక్నాలజీలను ఏకం చేయడం వలన మాత్రం మన జీవితాలు మెరుగు పడవు.

No comments:

Post a Comment