Wednesday, 11 July 2018

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం...ఫోటో న్యూస్ ఫీచర్


ముంబై నగరం భారీ వర్షాలతో అల్లాడుతోంది. కుండపోత వర్షం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. రైలు పట్టాల పైకి నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ రైల్వే సబర్బన్‌ సర్వీసులు నిలిచిపోయాయి. రాత్రి 200 మీటర్ల వర్షపాతం నమోదయింది. నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. నీళ్లు తగ్గే వరకు రైళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు మంచి నీరు సరఫరా చేసే తులసి సరస్సు పొంగి ప్రవహిస్తోంది.
No comments:

Post a Comment