Friday, 27 July 2018

ఎత్తైన భవనం పైనుంచి జలపాతం....ఫోటో ఫీచర్


ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణాలు చేపట్టడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది.


తాజాగా చైనాలో గియాంగ్‌ పట్టణంలో 108 మీటర్ల ఎత్తైన అద్దాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనం పైనుంచి జలపాతంలా నీళ్లు కిందకు పడేలా చేశారు.



ఈ కృత్రిమ జలపాతం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే జలపాతం రన్‌ చేయాలంటే చాలా ఖర్చవుతుందట. అందుకే రోజూ 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే జలపాతం రన్‌ చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక సందర్భాలు, కార్యక్రమాలు ఉన్నప్పుడు జలపాతం ఉండేలా చూస్తున్నారు. ఒక గంట పాటు జలపాతం రన్‌ చేస్తే సుమారు 8వేల రూపాయల ఖర్చవుతోంది. ఇక నీటి విషయానికొస్తే రీసైకిల్‌ చేసిన నీటినే వాడుతున్నారు. ప్రపంచంలో అతి పెద్ద కృత్రిమ జలపాతం ఇదే.


ఈ జాలువారే జలపాతాన్ని చూడటానికి జనం ఆసక్తి చూపుతున్నారట.

No comments:

Post a Comment