Wednesday, 4 July 2018

ప్రపంచంలోని అత్యంత రహస్య సమాజం:సమావేశంలోకి రహస్యంగా ప్రవేశించిన పత్రికా విలేఖరి...ఫోటో న్యూస్ ఆర్టికల్


ప్రపంచంలోని అత్యంత రహస్య సమాజం జరుపుతున్న సమావేశ ప్రదేశంలోకి డైలీ మైల్ పత్రికా విలేఖరి రహస్యంగా ప్రవేశించి 'బిల్డర్ బర్గ్ గ్రూప్' సమావేశమౌతున్న హోటల్ గురించి కొన్ని నిజాలను బయటపెట్టాడు..


ఈ రహస్య సమాజం మొట్టమొదటిసారి 1954 లో నెదర్లాండ్ లోని బిల్డ్ బర్గ్ హోటల్లో సమావేశమయ్యింది. అందువలన ఈ రహస్య సమాజానికి 'బిల్డర్ బర్గ్ గ్రూప్' అనే పేరు వచ్చింది.


ఈ రహస్య సమాజంలో అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన 120 నుండి 150 వరకు 'ప్రముఖ పౌరులు' సభ్యులుగా ఉన్నారు. వీరు అప్పుడప్పుడు మారుతూ ఉంటారు.


ఈ రహస్య 'బిల్డర్ బర్గ్’ సమాజం యొక్క 66 సంవత్సరాల చరిత్రలో ఒక పత్రికా విలేకరి అండర్ కవర్ గా ఉండి ఈ సంవత్సరం(2018)వారు జరుపుతున్న సమావేశ ప్రదేశానికి అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీని దాటుకుని వెళ్ళటం ఇదే మొదటి సారి.



ఈ రహస్య సమావేశం ఇటాలీ దేశంలోని NH లింగోటో హోటల్ లో హై సెక్యూరిటీ వలయంతో మూడు రోజుల పాటు జరిగింది. 'బిల్డర్ బర్గ్’ రహస్య సమాజం ఎప్పుడు సమావేశమైనా యాంటీ-టెర్రర్ స్క్వాడ్, మిలటరీ, నొ-ఫ్లై-జోన్ లాంటి అత్యంత హై సెక్యూరిటీ కలిగి ఉంటుంది.



వీరి సమావేశంలో రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, బ్యాంకింగ్ సెక్టార్, టెలికాం, టెక్నాలజీ, అకాడమియా, గూఢాచార సంస్థ లకు చెందిన దిగ్గజాలు పాల్గొంటారు. ఈ రహస్య సమాజం గురించి ఎన్నో రకాల వదంతులు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది వీరు ప్రతి సంవత్సరం కొత్త ప్రపంచ ఉత్తరువును రూపొందిస్తారట. వీరు రూపొందించిన ఉత్తరవు ప్రకారమే ప్రపంచ పరిపాలన సాగుతుందట.


ఈ రహస్య సమాజంలోని ప్రతి ఒక్క సభ్యుడు రహస్య ప్రమాణ స్వీకారానికి కట్టుబడి ఉండటం వలన ఈ సమాజ సమావేశలలొ దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతోంది అనేది అత్యంత రహస్యంగా ఉంచబడుతోంది.

ఫోటో క్రెడిట్: డైలీ మైల్

1 comment:


  1. బుచికోయమ్మ బుచికి

    ReplyDelete